bonalu: పాతబస్తీలో బోనాల సంద‌డి.. 8 వేల మందితో పోలీసు బందోబ‌స్తు

  • లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి ఉత్సవాలు
  • పెద్ద ఎత్తున వ‌చ్చిన‌ భక్తులు
  • బోనాలు తీసుకువచ్చే మహిళలకు ప్రత్యేక క్యూలైన్‌
bonalu celebrations in hyderabad

హైద‌రాబాద్‌లోని పాతబస్తీలో లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల
సంద‌ర్భంగా లాల్‌దర్వాజలోని అమ్మ‌వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. అమ్మ‌వారి గుడి వ‌ద్ద భక్తులకు అసౌక‌ర్యాలు క‌ల‌గ‌కుండా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

బోనాలు తీసుకువచ్చే మహిళలకు ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటు చేశారు. కాసేప‌ట్లో లాల్‌ద‌ర్వాజ‌కు తెలంగాణ‌ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు హోంమంత్రి మహమూద్ అలీ రానున్నారు. పాత‌బ‌స్తీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భ‌క్తులు క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని పోలీసులు సూచ‌న‌లు చేస్తున్నారు.

పాత‌బ‌స్తీ ప్రాంతంలో బోనాల పండుగ కోలాహ‌లం నెల‌కొంది. బోనాల సంద‌ర్భంగా ఆ ప్రాంతంలో మొత్తం 8 వేల మందితో బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. రేపు రంగం త‌ర్వాత అంబారీ ఊరేగింపు ఉంటుంద‌ని మంత్రి త‌ల‌సాని చెప్పారు.


More Telugu News