సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- జాక్ పాట్ కొట్టిన నభా నటేష్
- 'అఖండ'కు భారీ స్థాయి బిజినెస్
- 'ఉక్రెయిన్'కు 'ఆర్ఆర్ఆర్' టీమ్
* బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ కున్న క్రేజే వేరు. ప్రస్తుతం వీరి కలయికలో రూపొందుతున్న 'అఖండ' చిత్రానికి కూడా మొదటి నుంచీ ఎంతో క్రేజ్ వుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 40 కోట్ల వరకు జరిగినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ప్రగ్య జైస్వాల్ కథానాయికగా నటిస్తోంది.
* రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం చివరి షెడ్యూలు షూటింగ్ ఆగస్టు 2 నుంచి ఉక్రెయిన్ లో జరుగుతుంది. ఈ షెడ్యూలులో సన్నివేశాలతో పాటు ఎన్టీఆర్, చరణ్, అలియా భట్ లపై ఓ భారీ సాంగును కూడా అక్కడ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ఆగస్టు రెండో వారం వరకు అక్కడ ఈ షెడ్యూలు జరుగుతుంది.