Dhanush: ధనుశ్ హీరోగా 'మారన్' .. ఫస్టులుక్ రిలీజ్!

Maaran first look released
షార్ట్స్‌లో చూడండి
తమిళంలో విభిన్నమైన కథలకు .. పాత్రలకు ప్రాధాన్యతనిచ్చే హీరోగా ధనుశ్ కనిపిస్తాడు. ఒక వైపున తనకి గల మాస్ ఇమేజ్ ను కాపాడుకుంటూనే ఆయన కొత్త కథలను ఎంచుకుంటూ ఉంటాడు. అలా ఈ మధ్య కాలంలో ఆయన చేసిన 'అసురన్' .. 'కర్ణన్' చిత్రాలు అక్కడ మంచి ఫలితాలను దక్కించుకున్నాయి.

ధనుశ్ చేసిన మరో సినిమా విడుదలకు ముస్తాబవుతూ ఉండగానే, ఆయన మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. ఈ సినిమాకి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజున ధనుశ్ పుట్టినరోజు కావడంతో.. ఈ సినిమాకి 'మారన్' అనే టైటిల్ ను ఖరారు చేసి, ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో ధనుశ్ యాక్షన్ లుక్ ఆకట్టుకునేలా ఉంది.

'అతని ధైర్యమే అతని ఆయుధం' అంటూ ధనుశ్ పాత్రను గురించి కార్తీక్ నరేన్ హింట్ ఇచ్చాడు. కెరియర్ పరంగా ధనుశ్ కి ఇది 43వ సినిమా. అర్జున్ - త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. త్వరలో మిగతా వివరాలు తెలియనున్నాయి.
Go Back to Shorts
Dhanush
Karthik Naren
G V Prakash Kumar

More Telugu News