బార్లు, పబ్బులకు లేని సమస్య థియేటర్లకు ఎందుకు?: సినీ హీరో నాని

Theatres are safer than pubs and bars says actor Nani
  • పబ్బులు, బార్లలో మాస్కులు లేకుండా గట్టిగా మాట్లాడుతుంటారు
  • థియేటర్లలో మాస్కులు పెట్టుకుని సినిమా చూస్తుంటారు
  • భవిష్యత్ తరాలు థియేటర్లకు దూరమయ్యే ప్రమాదం ఉంది
కరోనా నేపథ్యంలో అన్నింటికంటే ముందు థియేటర్లను బంద్ చేశారని, అన్నింటికంటే ఆలస్యంగా థియేటర్లను ఓపెన్ చేశారని సినీ నటుడు నాని అన్నారు. బార్లు, పబ్ లలో అందరూ మాస్కులు తీసేసి, గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారని... థియేటర్లలో మాస్కులు పెట్టుకుని సినిమాను ఎంజాయ్ చేస్తుంటారని... బార్లు, పబ్బుల కంటే థియేటర్లే సేఫ్ అని చెప్పారు. బార్లు, పబ్బులకు లేని ఇబ్బంది థియేటర్లకు ఎందుకని ప్రశ్నించారు.

థియేటర్లపై ఆధారపడి లక్షలాది కుటుంబాలు బతుకుతున్నాయని... ఇవి మూత పడటం వల్ల వారందరి జీవితాలు రోడ్డుపై పడ్డాయని నాని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో థియేటర్లనే ముందుగా ఓపెన్ చేయాలని తాను చెప్పడం లేదని... మిగిలిన వాటితో పాటు థియేటర్లను కూడా ఓపెన్ చేయమని మాత్రమే చెపుతున్నానని నాని అన్నారు. సినీ నటుడిగా కాకుండా... ఒక సినీ ప్రేక్షకుడిగా తాను ఈ మాట చెపుతున్నానని వ్యాఖ్యానించారు.

విదేశాల్లో వీకెండ్ వస్తే అమ్మానాన్నలను చూడ్డానికి వెళతారని... మన దేశంలో అమ్మానాన్నలతో కలసి సినిమాకు వెళతారని నాని చెప్పారు. ఇతర దేశాల్లో వీకెండ్స్ లో ఫ్రెండ్స్ ని కలిసేందుకు వెళ్తే, మన దేశంలో ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకు వెళతారని అన్నారు. థియేటర్లలో సినిమాలు చూడటం మన సంస్కృతి అని చెప్పారు. పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లకు జనాలను దూరం చేస్తే... రాబోయే తరాలు థియేటర్లను మిస్ అయ్యే ప్రమాదం కూడా ఉందని అన్నారు. మనసులో చిన్న భయం, బాధ ఉందని... త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నానని చెప్పారు.
Go Back to Shorts
Nani
Tollywood
Therater

More Telugu News