India: దేశంలో కొత్తగా 43,654 క‌రోనా కేసులు

Media Bulletin on status of positive cases COVID19 in india
షార్ట్స్‌లో చూడండి
దేశంలో నిన్న కొత్తగా 43,654 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,14,84,605కు చేరింది. అలాగే, నిన్న 41,678 మంది కోలుకున్నారు.

మరణాల విషయానికొస్తే... నిన్న 640 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,22,022కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,06,63,147 మంది కోలుకున్నారు. 3,99,436 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 44,61,56,659 వ్యాక్సిన్ డోసులు వేశారు.
Go Back to Shorts
India
Corona Virus
COVID19

More Telugu News