Corona Virus: దేశంలో నిన్న కొత్తగా 39,742 క‌రోనా కేసులు

corona bulletin in india
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  3,13,71,901
  • నిన్న‌ 535 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 4,20,551
  • మొత్తం 43,31,50,864 వ్యాక్సిన్ డోసుల వినియోగం
దేశంలో నిన్న కొత్తగా 39,742 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,71,901కు చేరింది. అలాగే, నిన్న 39,972 మంది కోలుకున్నారు.

మరణాల విషయానికొస్తే... నిన్న‌ 535 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,20,551కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  3,05,43,138 మంది కోలుకున్నారు. 4,08,212 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 43,31,50,864 వ్యాక్సిన్ డోసులు వేశారు.

More Telugu News

Corona Virus
COVID19
India