రూ. లక్ష జరిమానాపై అప్పీల్ పిటిషన్ దాఖలు చేసిన కోలీవుడ్ హీరో విజయ్
- కారు దిగుమతి కేసులో విజయ్‌కు రూ. లక్ష జరిమానా విధించిన హైకోర్టు
- ద్విసభ్య ధర్మాసనం ముందుకు విజయ్ అప్పీల్ పిటిషన్
- సోమవారం విచారణకు వచ్చే అవకాశం
న్యాయమూర్తి జస్టిస్ సుబ్రహ్మణ్యం విధించిన జరిమానా, చేసిన వ్యాఖ్యలపై విజయ్ తాజాగా అప్పీల్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, ఈ అప్పీల్‌తో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు నకలు జతచేయని కారణంగా విచారణ జాబితాలో విజయ్ పిటిషన్‌ను పొందుపరచలేదు. దీనిపై నిన్న విచారణ చేపట్టిన కోర్టు.. విజయ్ అప్పీల్ పిటిషన్‌ను జస్టిస్ దురైస్వామి, జస్టిస్ హేమలతతో కూడిన ద్విసభ్య ధర్మాసనానికి సిఫారసు చేసింది. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.