Andhra Pradesh: ఏపీలో మరో 2,672 మందికి కరోనా పాజిటివ్

AP Corona cases and health update
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా వ్యాప్తిపై కమాండ్ కంట్రోల్ కేంద్రం తాజా బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 91,594 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,672 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 504 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 372, ప్రకాశం జిల్లాలో 315, పశ్చిమ గోదావరి జిల్లాలో 292 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 21 పాజిటివ్ కేసులు గుర్తించారు.

అదే సమయంలో 2,467 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,37,122 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 18,98,966 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 25,041 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 13,115కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Positive Cases
Deaths
Update
Bulletin

More Telugu News