జీవో నెం.2ని హైకోర్టు సస్పెండ్ చేయడంపై మంత్రి పెద్దిరెడ్డి స్పందన
- వీఆర్ఓలకు అధికారాల బదలాయింపు
- గతంలో జీవో-2 తీసుకువచ్చిన సర్కారు
- లోపాలు సరిదిద్దుకుంటామన్న పెద్దిరెడ్డి
- మళ్లీ జీవో జారీ చేస్తామని వెల్లడి
పరిపాలనా సౌలభ్యం కోసమే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశామని, వాటిని తగిన విధంగా బలోపేతం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పుడెలాగూ కోర్టు జీవోను కొట్టివేసింది కాబట్టి, లోపాలను సరిదిద్దుకుని మళ్లీ జీవో జారీ చేస్తామని వెల్లడించారు. దీనిపై న్యాయ విభాగంతోనూ, సంబంధిత శాఖాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.