Kriti Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'ఉప్పెన' భామకు మరో ఆఫర్ 
  • రొమాంటిక్ సీన్స్ చేస్తున్న రవితేజ
  • హిందీ సినిమా షూటింగులో చైతూ  
Kruti Shetty gets one more offer from Tollywood

*  'ఉప్పెన' సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న కథానాయిక కృతిశెట్టి ప్రస్తుతం తెలుగులో నాని, రామ్ హీరోలుగా రూపొందుతున్న సినిమాలలో కథానాయికగా నటిస్తోంది. ఈ క్రమంలో తాజాగా నాగ చైతన్య సరసన ఓ సినిమాలో కూడా నటించనున్నట్టు తెలుస్తోంది. నాగార్జున హీరోగా నటించే 'బంగార్రాజు' సినిమాలో చైతూ సరసన నాయికగా నటించే ఛాన్స్ కృతికి వచ్చినట్టు సమాచారం.
*  'ఖిలాడి' సినిమా తర్వాత రవితేజ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన రొమాంటిక్ సన్నివేశాలను ప్రస్తుతం హీరో హీరోయిన్లు రవితేజ, దివ్యాంషు కౌశిక్ లపై చిత్రీకరిస్తున్నారు.
*  అక్కినేని నాగ చైతన్య తొలిసారిగా ఓ హిందీ సినిమాలో నటిస్తున్నాడు. ఆమిర్ ఖాన్ హీరోగా రూపొందుతున్న 'లాల్ సింగ్ చద్దా' చిత్రంలో చైతూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా, ముంబైలో జరుగుతున్న ఈ చిత్రం షూటింగులో చైతూ నిన్న జాయిన్ అయ్యాడు. ముంబైలో షూటింగ్ అనంతరం కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం యూనిట్ కార్గిల్ కు వెళుతుంది.

More Telugu News