Balakrishna: బాలయ్యను మెప్పించిన అనిల్ రావిపూడి!

  • వరుస హిట్లతో ఉన్న అనిల్ రావిపూడి
  • షూటింగు దశలో 'ఎఫ్ 3'
  • సంక్రాంతికి భారీ విడుదల
  • తదుపరి సినిమా బాలయ్యతోనే
Balakrishna agreed for Anil Ravipudi story

యువ దర్శకులలో అనిల్ రావిపూడి జోరు కొనసాగుతోంది. రచన వైపు నుంచి రావడం వలన ఆయనకి కథాకథనాలపై మంచి పట్టు ఉంది. కథలో ఏయే అంశాలు ఎంతలో ఉండాలో .. ఎక్కడ ఏ విషయాన్ని చెప్పాలో ఆయనకి బాగా తెలుసు. అందువలన ఇంతవరకూ ఆయనకి అపజయమనేది తెలియదు. బాలకృష్ణ 100వ సినిమాను తన కథతో అనిల్ రావిపూడి చేయాలనుకున్నాడు .. కానీ కుదరలేదు. అలాంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. ఈ ఇద్దరి కాంబినేషన్ త్వరలోనే సెట్స్  పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు.

అనిల్ రావిపూడి చెప్పిన ఒక లైన్ బాలయ్యకి నచ్చిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసిన అనిల్ రావిపూడి, తాజాగా దానిని బాలకృష్ణకి వినిపించాడట. బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ .. గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ తరువాత అనిల్ రావిపూడి ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ లోగా అనిల్ రావిపూడి 'ఎఫ్ 3' సినిమాను పూర్తిచేస్తాడన్న మాట. వెంకటేశ్ - వరుణ్ తేజ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాను 'సంక్రాంతి'కి విడుదల చేయనున్నారు.

More Telugu News