Colombia: కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై కాల్పులు 

  • సార్డినటా నుంచి కుకుటా వెళ్తుండగా ఘటన
  • హెలికాప్టర్‌లో అధ్యక్షుడితోపాటు కేంద్రమంత్రులు, గవర్నర్
  • క్షేమంగా బయటపడ్డామన్న ఇవాన్ డ్యూక్
Colombian President Says Helicopter Hit By Gunfire

కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్‌తోపాటు ఇద్దరు కేంద్రమంత్రులు, ఉత్తర శాంటాడర్ గవర్నర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై శుక్రవారం కాల్పులు జరిగాయి. సార్డినటా నుంచి కుకుటా నగరానికి వెళ్తుండగా వెనుజువెలా సరిహద్దులో ఈ కాల్పులు జరిగాయి. ఈ ప్రాంతంలో సాయుధ ముఠాలు డ్రగ్స్ రవాణా, ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తుండడం గమనార్హం. కొలంబియాలోని తిరుగుబాటు సైన్యం, గెరిల్లా దళాలు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా, ఈ ఘటన నుంచి తాము క్షేమంగా బయటపడినట్టు ఇవాన్ నిన్న తెలిపారు.

More Telugu News