తెలంగాణలో రేపు భారీ వర్షాలు: వాతావరణ శాఖ
- ఈ నెల 4న రాష్ట్రాన్ని తాకిన వర్షాలు
- తొలకరి వర్షాల తర్వాత ముఖం చాటేసిన వానలు
- నల్గొండలో నిన్న అత్యధికంగా 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
నైరుతి రుతుపవనాలు ఈ నెల 4న తెలంగాణను తాకాయి. దీంతో తొలకరి వర్షాలు కురిశాయి. ఆ తర్వాతి నుంచి వర్షాలు ముఖం చాటేశాయి. గత వారం రోజులుగా రాష్ట్రంలో వాన జాడే లేకుండా పోయింది. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. రుతుపవనాల్లో కదలికలు లేక ఆకాశం నిర్మలంగా ఉంటోంది. వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. నిన్న నల్గొండ జిల్లాలో అత్యధికంగా 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఇది మూడు డిగ్రీలు అదనం. మొదట్లో మురిపించిన వానలు తర్వాత ముఖం చాటేయడంతో రైతులు ఆందోళనలో మునిగిపోయారు.