తిరుపతిలో కరోనా డెల్టా ప్లస్ కేసు... ఏపీలో ఇదే మొదటిదన్న మంత్రి ఆళ్ల నాని
- కొవిడ్ పై సీఎం జగన్ సమీక్ష
- హాజరైన ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని
- ఇటీవల ఓ వ్యక్తికి డెల్టా ప్లస్ సోకినట్టు వెల్లడి
- చికిత్స పూర్తయి కోలుకున్నాడని వివరణ
- అతడి నుంచి ఎవరికీ సోకలేదని స్పష్టీకరణ
కాగా, యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా డెల్టా వేరియంట్ జన్యు ఉత్పరివర్తనం చెంది డెల్టా ప్లస్ గా మార్పు చెందిందని నిపుణులు గుర్తించడం తెలిసిందే. ఇప్పటికే భారత్ లోని పలు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ ఉనికి వెల్లడైంది. మహారాష్ట్రలో అత్యధికంగా 21 కేసులు నమోదు కాగా, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్ లోనూ పలువురు దీని బారినపడ్డారు.