Dhanush: రాజకీయాల నేపథ్యంలో ధనుశ్ .. శేఖర్ కమ్ముల మూవీ?

  • ధనుశ్ హీరోగా శేఖర్ కమ్ముల మూవీ
  • యథార్థ సంఘటన ఆధారంగా కథ
  • త్వరలోనే సెట్స్ పైకి
  • తెరపైకి సాయిపల్లవి పేరు
Sekhar kammula and Dhanush movie is based on politics

శేఖర్ కమ్ముల .. ధనుశ్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుంది. నారాయణ దాస్ నారంగ్ - రామ్మోహన్ రావ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథా నేపథ్యం ఏమై ఉంటుందనే ఆసక్తి అందరిలో మొదలైంది. తమిళనాడు రాజకీయాలతో ముడిపడిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా కథను రెడీ చేసుకున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. పొలిటికల్ టచ్ తో .. శేఖర్ కమ్ముల మార్కుతో ఈ కథ నడుస్తుందని అంటున్నారు.

తెలుగు .. తమిళ భాషలతో పాటు హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా కోసం ధనుశ్ అందుకునే పారితోషికం 30 కోట్లు అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ధనుశ్ జోడీగా సాయిపల్లవిని తీసుకునే ఆలోచనలో శేఖర్ కమ్ముల ఉన్నాడని అంటున్నారు. తెలుగులో శేఖర్ కమ్ముల - సాయిపల్లవి కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది. అలాగే ధనుశ్ - సాయిపల్లవి జంటకి తమిళనాట మంచి ఆదరణ ఉంది. అందువలన ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

More Telugu News