జగన్ కేసులపై విచారణను వాయిదా వేసిన హైకోర్టు
- ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ పై పలు కేసుల నమోదు
- వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల ఉపసంహరణ
- సుమోటోగా తీసుకుని విచారణ ప్రారంభించిన హైకోర్టు
ఈ వ్యవహారంపై ఊహించని విధంగా ఏపీ హైకోర్టు స్పందించింది. కేసుల ఉపసంహరణను సుమోటోగా తీసుకుని విచారణ ప్రారంభించింది. దీనిపై ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలను వినిపించారు.
న్యాయపరమైన చర్యలను పరిపాలన విధానాల ద్వారా తీసుకోవడం న్యాయ విరుద్ధమని ఆయన అన్నారు. ఈ కేసులకు సంబంధించి కోర్టుకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని... ఈ కేసుకు విచారణార్హత ఉందో, లేదో నిర్ధారించాలని కోరారు. ఏజీ వాదనలను విన్న హైకోర్టు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.