జగన్ ఆస్తుల కేసు... సీబీఐ-ఈడీ కోర్టులో విచారణ వచ్చే నెల 2కి వాయిదా
- జగన్ ఆస్తుల వ్యవహారంపై కోర్టులో విచారణ
- తన న్యాయవాదిని అనుమతించాలన్న సీఎం జగన్
- అభియోగాల నమోదు వాయిదా వేయాలన్న విజయసాయి
- వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం
అయితే హైకోర్టు జడ్జి సెలవులో ఉన్నారని, దాంతో పిటిషన్లు ఇంతవరకు విచారణకు రాలేదని సీబీఐ-ఈడీ కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో, ఈడీ కేసుల విచారణకు సంబంధించిన అభియోగాల నమోదును వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. దాంతో, కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 2కి వాయిదా వేసింది. అటు, ఈ కేసులో జగన్ తరఫు వాదనలు కూడా అవసరమని కోర్టు అభిప్రాయపడింది.