కరోనా వ్యాక్సినేషన్ అంశంపై గవర్నర్ కు వినతిపత్రం సమర్పించిన ఉత్తమ్, రేవంత్
- గవర్నర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు
- రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ వ్యాక్సినేషన్ పై వినతులు
- దేశమంతా ఒకే విధానం అమలు చేయాలని విజ్ఞప్తి
- వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచన
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా, బ్లాక్ ఫంగస్ చికిత్సలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి పెనుభారంగా పరిణమించాయని, అందుకే వాటిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.