ఏపీలో సీనియర్ రెసిడెంట్ వైద్యుల స్టైపెండ్ రూ. 70 వేలకు పెంపు
- ప్రస్తుతం రూ. 45 వేలుగా ఉన్న స్టైపెండ్
- కొవిడ్ నేపథ్యంలో ఆందోళన విరమించాలని కోరిన సింఘాల్
- రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో బెడ్ల ఖాళీలు పెరుగుతున్నాయన్న అనిల్ కుమార్
అలాగే, వ్యాక్సినేషన్ విషయంలో విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలోని కొవిడ్ ఆసుపత్రులు, కేంద్రాల్లో బెడ్ల ఖాళీల సంఖ్య పెరుగుతోందన్నారు. అలాగే డిశ్చార్జ్‌లు కూడా పెరుగుతున్నట్టు చెప్పారు.
విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు, ఉద్యోగులు తమ పాస్‌పోర్టు నంబరు కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కొవిన్ యాప్‌లో ప్రస్తుతం ఈ సదుపాయం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయని, ఈ సమస్యను సవరించేందుకు కేంద్రానికి లేఖ రాశామని సింఘాల్ తెలిపారు.