Chiranjeevi: చిరంజీవి, నాగబాబు, పవన్ ల చిన్ననాటి ఫొటో వైరల్

  • నేడు అంతర్జాతీయ బ్రదర్స్ డే
  • సోషల్ మీడియాలో స్పందించిన చిరు
  • అరుదైన ఫొటోను పంచుకున్న వైనం
  • హ్యాపీ బ్రదర్స్ డే అంటూ శుభాకాంక్షలు
Childhood photo of Mega Brothers went viral in International Brothers Day

ఇవాళ అంతర్జాతీయ బ్రదర్స్ డే. ఈ సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో తన ఇద్దరు సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్ లతో తన చిన్నప్పటి ఫొటోను కూడా పంచుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఆ ఫొటోలో చిన్నవాడైన పవన్ కల్యాణ్ ను చిరంజీవి ఎత్తుకోగా, పక్కనే నాగబాబు చిరునవ్వులు చిందిస్తూ ఉండడాన్ని చూడొచ్చు. ఈ ఫొటోను పోస్టు చేసిన చిరంజీవి.... తోడబుట్టిన బ్రదర్స్ కి, రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ (ఫ్యాన్స్)కి హ్యాపీ బ్రదర్స్ డే అంటూ విషెస్ తెలిపారు. ఈ ఫొటో పోస్టు చేసిన కొద్దిసేపట్లోనే వేలల్లో లైకులు, రీట్వీట్లు వచ్చాయి.

More Telugu News