Alia Bhatt: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • చరణ్ సరసన అలియా మరోసారి?
  • రికార్డు రేటుకి 'ఆర్ఆర్ఆర్' హక్కులు
  • ఫుట్ బాల్ ఆటగాడిగా నాని    
Alia Bhat opposite Ram Charan again

*  రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక భారీ చిత్రం రూపొందనున్న సంగతి విదితమే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. కాగా, ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి అలియా భట్ నటించే అవకాశం వుంది. ప్రస్తుతం ఈ విషయంలో ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయట. కాగా, అలియా ఇప్పటికే చరణ్ సరసన 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్న విషయం తెలిసిందే.
*  ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి సంబంధించిన బిజినెస్ కనీవినీ ఎరుగని స్థాయిలో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం డిజిటల్ హక్కులను ZEE 5 సంస్థ 325 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంతవరకు డిజిటల్ హక్కుల పరంగా ఒక భారతీయ చిత్రానికి ఇంతటి రేటు రాలేదనే చెప్పాలి.
*  గతంలో 'భీమిలి కబడ్డీ జట్టు', 'జెర్సీ' వంటి స్పోర్ట్స్ ప్రధాన కథా చిత్రాలలో నటించిన నేచురల్ స్టార్ నాని త్వరలో మరో స్పోర్ట్స్ డ్రామాలో నటించనున్నాడు. ఓ కొత్త దర్శకుడు రూపొందించే చిత్రంలో ఫుట్ బాల్ ప్లేయర్ గా నాని కనిపించనున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

More Telugu News