Nani: 'శ్యామ్ సింగ రాయ్'కి సెట్టు తెచ్చిన నష్టం!

Shyam Singha Roy set damaged due to heavy rains
షార్ట్స్‌లో చూడండి
నాని కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' సినిమా రూపొందుతోంది. నాని కెరియర్లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా కోసం 10 ఎకరాల్లో ఆరున్నర కోట్ల రూపాయల బడ్జెట్ తో భారీ సెట్లు వేశారు. నిన్న మొన్నటి వరకూ ఈ సెట్లోనే కీలకమైన సన్నివేశాలను రూపొందిస్తూ వచ్చారు. అయితే కరోనా అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో, షూటింగును వాయిదా వేశారు.

అయితే కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ సెట్ భారీగానే దెబ్బతిందట. ఇలా జరగడం నిర్మాతకు కొంత నష్టాన్ని కలిగించిందనే అంటున్నారు. సెట్టును ఒకసారి మళ్లీ చెక్ చేసుకుని, తగిన మరమ్మతులు చేసిగానీ షూటింగుకు దిగడానికి లేదట. కరోనా లేకపోతే ఈ పాటికే ఆ సెట్టులో షూటింగు అయిపోయేదనీ, ఈ నష్టం జరగకుండా ఉండేదని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో నాని డిటెక్టివ్ గా నటిస్తుండగా, ఆయన సరసన హీరోయిన్లుగా సాయిపల్లవి .. కృతి శెట్టి కనిపించనున్నారు. మిక్కీ.జె మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
Go Back to Shorts
Nani
Sai Pallavi
Kruthi Shetty

More Telugu News