China: తీరు మార్చుకోని చైనా.. స‌రిహ‌ద్దుల వ‌ద్ద‌కు మ‌ళ్లీ సైన్యం

  • తూర్పు ల‌ఢ‌ఖ్ సెక్టార్‌కు స‌మీపంలో సైనిక విన్యాసాలు
  • చైనా సైన్యం తీరును నిశితంగా ప‌రిశీలిస్తున్న భార‌త్
  • గ‌త ఏడాది ఇదే స‌మ‌యంలో ల‌ఢ‌ఖ్‌లో ఉద్రిక్త‌త‌లు
Chinese Army returns to exercise areas near eastern Ladakh

చైనా త‌న బుద్ధిని మార్చుకోవ‌డం లేదు. స‌రిహ‌ద్దుల వ‌ద్ద‌కు మ‌ళ్లీ చైనా సైన్యం విన్యాసాలు ప్రారంభించింది. భార‌త్‌ క‌రోనాతో అల్లాడిపోతోన్న స‌మ‌యంలో చైనా ఈ తీరును ప్ర‌ద‌ర్శిస్తుండ‌డం గ‌మ‌నార్హం. తూర్పు ల‌ఢ‌ఖ్ సెక్టార్‌కు స‌మీపంలో చైనా సైనిక విన్యాసాలు చేస్తుండ‌డాన్ని భార‌త్ గుర్తించింది. చైనా సైన్యం తీరును నిశితంగా ప‌రిశీలిస్తోంది. స‌రిహ‌ద్దుల మీదుగా కొన్ని గంట‌ల్లోనే భార‌త్ లోకి ప్ర‌వేశించేందుకు వీలు ఉన్న ప్రాంతాల్లో చైనా సైన్యం ఉంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి.

అంతేగాక‌, ఆయా ప్రాంతాల్లో మౌలిక వ‌స‌తుల‌ను చైనా అభివృద్ధి ప‌రుచుకుంటోంది. గ‌త ఏడాది ఇదే స‌మ‌యంలో చైనా-భార‌త్ సైన్యాలు తూర్పు ల‌ఢ‌ఖ్ ప్రాంతంలో భారీగా మోహ‌రించిన విష‌యం తెలిసిందే. అనేక ద‌శల చ‌ర్చ‌ల అనంత‌రం ఇరు దేశాల సైనికులు వెన‌క్కి వెళ్లారు. అయితే, చైనా మ‌ళ్లీ త‌న బుద్ధిని చూపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News