భారత్‌లోని కొత్త రకం కరోనా వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తోన్న ఫైజర్, మోడెర్నా టీకాలు
- బి.1.617తో పాటు బి.1.618 వేరియంట్ పై టీకాల ప్రభావశీలతపై అధ్యయనం
- ఆ వ్యాక్సిన్లను తీసుకున్నవారి నుంచి నమూనాలు సేకరించి పరిశోధన
- 3-4 రెట్లు అధికంగా ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని వెల్లడి
ఫైజర్, మోడెర్నా టీకాలు రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు 3-4 రెట్ల అధికంగా ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని గుర్తించినట్లు చెప్పారు. అధిక శాతం ప్రతిరక్షకాలు ఈ వేరియంట్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.
శరీరంలోని ఏసీఈ2 కణాలు కరోనా గ్రాహకాలుగా మారుతున్నాయని, ఈ కారణంగానే కరోనా వ్యాపించే తీరులో అనేక మార్పులొస్తున్నట్లు వారు చెప్పారు. అయితే, ఆయా వేరియంట్లను వ్యాక్సిన్లు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా వీలైనంత త్వరగా వ్యాక్సిన్లను వేయడం ద్వారా కరోనాను నియంత్రించవచ్చని చెప్పారు.