Bihar: బీహార్ లో గంగానదిలో తేలిన 100 కరోనా మృతదేహాలు

100 corona dead bodies floated in Ganges river in Bihar
షార్ట్స్‌లో చూడండి
గంగానదిలో ఏకంగా 100 కరోనా మృతదేహాలు తేలడం బీహార్ లో కలకలం రేపుతోంది. బక్సర్ జిల్లాలోని మహదేవ్ ఘాట్ వద్ద ఈ శవాలు నీటిపై తేలుతూ కనిపించాయి. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ శవాలు బీహార్ కు చెందినవి కాదని... తాము ఆరా తీయగా ఉత్తరప్రదేశ్ నుంచి కొట్టుకొచ్చాయని తేలిందని బక్సర్ జిల్లా అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ, మహదేవ్ ఘాట్ కు 40 నుంచి 45 వరకు శవాలు కొట్టుకొచ్చాయని చెప్పారు. తమ ప్రాంతంలో ఎవరైనా కరోనాతో మరణిస్తే దహనం చేస్తున్నామని... కాపలాదారులను పెట్టి మరీ దహన ప్రక్రియను పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ శవాలు ఉత్తరప్రదేశ్ నుంచి కొట్టుకు వచ్చి ఉంటాయని చెప్పారు. నదిలో డెడ్ బాడీలను అడ్డుకునే మార్గం లేకపోవడంతో ఇక్కడి వరకు కొట్టుకొచ్చాయని అన్నారు.
Go Back to Shorts
Bihar
Corona Virus
Dead Bodies
Ganges

More Telugu News