బాధలోనూ చిన్న చిన్న సంతోషాలను వెతుక్కోవాలి: రేణూ దేశాయ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాధలోనూ చిన్న చిన్న సంతోషాలను వెతుక్కోవాలి: రేణూ దేశాయ్

Renu Desai Comments on Corona
  • సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు
  • తాజాగా కరోనా ఉద్ధృతిపై స్పందన
  • కాలం గడిచే కొద్దీ కష్టం తీరుతుందని వ్యాఖ్య
సామాజిక మాధ్యమాల్లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడు తన విషయాలను అభిమానులతో పంచుకునే రేణూ దేశాయ్, తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా, ఇండియాలో కరోనా మహమ్మారి ఉద్ధృతిపై స్పందించారు. ఇప్పటికే ఎన్నో బాధలను లెక్కలేనంతగా భరించామని, వాటిని మోసి, గాడిదల్లా తయారయ్యామని అభిప్రాయపడ్డ ఆమె, కేవలం బాధ పడేందుకు మాత్రమే ఈ శరీరం లేదని, బాధల్లోనూ చిన్న చిన్న సంతోషాలు వెతుక్కోవాలని సూచించారు. దాంతో కొంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చని, తద్వారా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారికి ఉపశమనం కలుగుతుందని వ్యాఖ్యానించారు.

కాస్తంత సంతోషంగా గడిపేందుకు కామెడీ వీడియోలను లేదా క్యూట్ గా ఉండే కుక్కపిల్లల వీడియోలను చూడాలని సూచించిన ఆమె, కాలం గడిచేకొద్దీ కష్టాలు కూడా తీరుతాయని చెప్పుకొచ్చారు. జాగ్రత్తలు పాటిస్తూ, సురక్షితంగా ముందుకు వెళ్లాల్సిన సమయం ఇది అంటూ ధైర్యం చెప్పుకొచ్చారు.
Renu Desai
Corona
Instagram
Happyness

More Telugu News