ఆ ఐదు రాష్ట్రాల విమాన ప్రయాణికులకు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసిన పశ్చిమ బెంగాల్
- కరోనా ఉద్ధృతి నేపథ్యంలోనే నిర్ణయం
- జాబితాలో ఢిల్లీ, యూపీ, ఎంపీ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్
- పౌరవిమానయాన శాఖకు లేఖ రాసిన బెంగాల్
- ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తెలంగాణకు అమల్లో ఉన్న నిబంధన
ఈ మేరకు బెంగాల్ ప్రభుత్వం పౌరవిమానయాన శాఖకు లేఖ రాసింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చే ప్రయాణికులకు నెగెటివ్ ఆర్‌టీ-పీసీఆర్ సర్టిఫికెట్ తప్పసరిగా చూపించాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు అమల్లో ఉంది. పైన పేర్కొన్న రాష్ట్రాల్లో కరోనా భారీ స్థాయిలో విజృంభిస్తోంది.
మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరో రెండు విడతల పోలింగ్ మిగిలి ఉంది. ఈ తరుణంలో అక్కడి సర్కార్ కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేయడం గమనార్హం.