Nani: కాళికాదేవి సెట్లో నాని ఫ్లాష్ బ్యాక్ సీన్స్!

  • డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న నాని
  • హీరోయిన్లుగా కృతి శెట్టి - మడోనా
  • 10 ఎకరాల్లో ఆరున్నర కోట్లతో సెట్
Nani flash back scenes in Kalikadevi sets

నాని కథానాయకుడిగా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను రూపొందిస్తున్నాడు. వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా కోసం హైదరాబాద్ లోనే కోల్ కత నేపథ్యంలోని 'కాళికాదేవి' ఆలయం సెట్ ను వేశారు. కథ ప్రకారం 100 సంవత్సరాల క్రితం నాటి ఆలయంలా ఇది కనిపిస్తుందన్న మాట. 10 ఎకరాల్లో ఆరున్నర కోట్ల రూపాయల ఖర్చుతో ఈ సెట్ ను వేశారు. ఈ వార్త బయటికి వచ్చిన దగ్గర నుంచి, ఈ సెట్లో ఎలాంటి సన్నివేశాలను తెరకెక్కించనున్నారు? అనే కుతూహలంతో అభిమానులు ఉన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ అవినాశ్ కుల్లా తీర్చిద్దిద్దిన ఈ సెట్ లో చిత్ర్రీకరించే సీన్స్ అన్నీ కూడా కీలకమైనవేనట. నాని ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తారని, ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఈ సెట్ లో జరిగే ఉత్కంఠభరితమైన సన్నివేశంపైనే ఉంటుందని అంటున్నారు. డిఫరెంట్ లుక్ తో నాని కనిపించే ఈ సినిమాలో, ఆయన సరసన నాయికలుగా కృతి శెట్టి, మడోనా సెబాష్టియన్ కనిపించనున్నారు. ఈ సినిమా తన కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని నాని చెప్పడంతో, ఆయన అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

More Telugu News