Nara Lokesh: క‌న్న‌బాబు అరాచ‌కాల‌కు హ‌ద్దే లేకుండా పోయింది: లోకేశ్

  • నియోజ‌క‌వ‌ర్గంలో క‌న్నబాబు చేసిందే చ‌ట్టం, చెప్పిందే వేదం
  • ద‌ళితుడు భూపతి అప్పారావుపై దౌర్జ‌న్యం
  • త‌న ఎమ్మెల్యేల‌కు వైఎస్ జ‌గ‌న్ ఏమైనా లైసెన్స్ ఇచ్చారా?  
lokesh slams ycp

వైసీపీ నేత‌ల‌పై టీడీపీ నేత నారా లోకేశ్ మండిప‌డ్డారు. య‌‌ల‌మంచిలి వైసీపీ ఎమ్మెల్యే క‌న్న‌బాబు బెదిరిస్తున్నారంటూ అప్పారావు అనే వ్య‌క్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేశార‌ని వ‌చ్చిన వార్త‌ను ఆయ‌న పోస్ట్ చేశారు.

'దౌర్జ‌న్యాల‌కు ప్యాంటు, అక్ర‌మాల‌కు షర్టు వేసిన‌ట్టుండే య‌‌ల‌మంచిలి వైసీపీ ఎమ్మెల్యే క‌న్న‌బాబు అరాచ‌కాల‌కు హ‌ద్దే లేకుండా పోయింది. నియోజ‌క‌వ‌ర్గంలో క‌న్నబాబు చేసిందే చ‌ట్టం, చెప్పిందే వేదం, క‌న్నుప‌డితే క‌బ్జా ఖాయం' అని విమ‌ర్శించారు.
 
'రాంబిల్లికి చెందిన ద‌ళితుడు భూపతి అప్పారావు (పండు) త‌న‌కు ఎమ్మెల్యే అనుచ‌రుల నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని 22-03-2021న పోలీసుల‌కు ఫిర్యాదు ఇవ్వ‌డ‌మే చేసిన పాపంగా చంపేయ‌డానికి య‌త్నించారు రౌడీ ఎమ్మెల్యే అనుచ‌రులు' అని మండిప‌డ్డారు

'ద‌ళితుల‌పై ద‌మ‌న‌కాండ సాగించేందుకు త‌న ఎమ్మెల్యేల‌కు వైఎస్ జ‌గ‌న్  ఏమైనా లైసెన్స్ ఇచ్చారా? ఇలా చెలరేగిపోతున్నారు' అని నారా లోకేశ్ ప్రశ్నించారు.

More Telugu News