సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ఓటీటీకి వస్తున్న అలియా భట్ సినిమా
- భారీ రేటుకి 'అఖండ' డిజిటల్ హక్కులు
- మరో సినిమాను లైన్లో పెట్టిన అఖిల్
* బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న 'అఖండ' చిత్రం డిజిటల్ హక్కులను తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ రేటుకి సొంతం చేసుకుంది. అలాగే శాటిలైట్ హక్కులను స్టార్ మా ఫ్యాన్సీ రేటుకి పొందినట్టు తెలుస్తోంది. ఉగాదికి విడుదలైన ఈ చిత్రం టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
* ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' చిత్రంలో నటిస్తున్న అఖిల్ అక్కినేని తాజాగా మరో చిత్రాన్ని అంగీకరించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రానికి 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తాడు. ఇదిలావుంచితే, పూజ హెగ్డేతో కలసి అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్' సినిమా ఈ వేసవిలో విడుదలవుతోంది.