బోయపాటి దర్శకత్వంలో రామ్ ప్రాజక్ట్?

Boyapati to direct Ram
  • లింగుస్వామితో రామ్ తాజా చిత్రం
  • రామ్ సరసన నాయికగా కృతి శెట్టి  
  • బోయపాటితో మరో ప్రాజక్టు ఓకే  
ఇటీవల 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో రామ్, తన తదుపరి చిత్రాన్ని కూడా ఇప్పటికే ప్రకటించాడు. ప్రముఖ తమిళ దర్శకుడు, 'పందెం కోడి' ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చేయనున్నాడు. లింగుస్వామి అంటేనే స్టయిలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్లు మనకు గుర్తొస్తాయి. ఇప్పుడీ చిత్రం కూడా అదే రీతిలో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటిస్తుంది.

ఇదిలావుంచితే, రామ్ హీరోగా మరో సినిమాకు కూడా ప్లానింగ్ జరుగుతోంది. యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దీనికి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. బోయపాటి చెప్పిన లైన్ రామ్ కి నచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్టు పని జరుగుతోందట. ప్రస్తుతం బాలకృష్ణతో బోయపాటి ఓ భారీ చిత్రాన్ని చేస్తున్నాడు. అది పూర్తయ్యాక ఈ చిత్రం సెట్స్ కి వెళుతుందని సమాచారం.
Go Back to Shorts
Ram
Boyapati Sreenu
Lingu Swamy

More Telugu News