USA: 'మేకిన్​ ఇండియా'పై అమెరికా అక్కసు!

Make In India Epitomises Challenges In Trade With India US Report
షార్ట్స్‌లో చూడండి
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంపై అమెరికా అక్కసు వెళ్లగక్కింది. ఆ నిబంధనల వల్ల అమెరికా ఎగుమతులు తగ్గిపోతున్నాయని, దాని వల్ల అమెరికా– భారత్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు దెబ్బ తింటున్నాయని వ్యాఖ్యానించింది. మేకిన్ ఇండియా నినాదంతో దిగుమతులను భారత్ తగ్గించేసిందని అమెరికా కాంగ్రెస్ కు జో బైడెన్ ప్రభుత్వం వెల్లడించింది.

ఈ మేరకు యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్).. 2021 వాణిజ్య విధాన ఎజెండాతో పాటు 2020 వార్షిక నివేదికను విడుదల చేసింది. అమెరికా ఎగుమతిదారులకు మేకిన్ ఇండియా వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యల గురించి భారత్ కు వివరించామని, ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొంది.

‘‘ఇండియ చాలా పెద్ద విపణి. ఆ దేశ ఆర్థిక వృద్ధి, అభివృద్ధిలో పురోగతి నేపథ్యంలో చాలా మంది అమెరికా ఎగుమతి దారులు భారత్ ను మంచి మార్కెట్ గా భావిస్తున్నారు. అయితే, వాణిజ్యాన్ని నిరోధించే భారత్ చర్యల వల్ల వారికి నష్టం కలుగుతోందన్నారు. ఇరు దేశాల వాణిజ్య విధానాలు, బంధానికి అడ్డంకిగా మారిన సమస్యల్లో ‘మేకిన్ ఇండియా’ ఓ మంచి ఉదాహరణ’’ అని పేర్కొంది.

మేధో హక్కులు సహా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను దెబ్బతీసే చర్యలపై గత ఏడాది మొత్తం భారత్ తో చర్చలు జరిపామని యూఎస్టీఆర్ వెల్లడించింది. ఎలక్ట్రానిక్, డిజిటల్ వాణిజ్యం, వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తులు, సేవల మార్కెట్ కు అడ్డుగా మారుతున్న విధాన నిర్ణయాలు వాటి అమలుపై భారత్ తో సంప్రదింపులు చేశామని పేర్కొంది.

ఆ చర్చల వల్లే గత ఏడాది జులైలో అమెరికా నుంచి పంపిన లాక్టోజ్, వెయ్ ప్రొటీన్ కాన్ సంట్రేట్ ల దిగుమతికి భారత్ అంగీకరించిందని యూఎస్టీఆర్ చెప్పింది. ఉత్పత్తులతో పాటు డెయిరీ సర్టిఫికెట్ నూ తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొంటూ 2020 ఏప్రిల్ నుంచి వాటిని భారత్ బ్లాక్ చేసిందని గుర్తు చేసింది.
Go Back to Shorts
USA
India
USTR
Trade Relations
Make In India

More Telugu News