Same Sex Marriage: స్వలింగ వివాహం అనేది ప్రాథమిక హక్కేమీ కాదు: స్పష్టం చేసిన కేంద్రం

  • స్త్రీ, పురుషుల మధ్య బంధమే వివాహం
  • స్వలింగుల వివాహాన్ని సమాజం అంగీకరించదు
  • చట్టపరంగానూ గుర్తించలేమన్న కేంద్రం
Center Says Same Sex Marriage is not a Right

ఇండియాలో వివాహానికి ఎంతో విలువ ఉందని, ఇది కేవలం ఇద్దరు వ్యక్తులను కలిపేది కాదని, స్త్రీ, పురుషుల మధ్య ఓ బంధమని కేంద్రం పేర్కొంది. ఢిల్లీ హైకోర్టులో వచ్చిన ఓ కేసు విచారణ సందర్భంగా ఇండియాలో స్వలింగుల మధ్య వివాహం ప్రజలకున్న హక్కేమీ కాదని పేర్కొంది.

ఇటువంటి కేసుల్లో న్యాయస్థానాలు కల్పించుకోవడం వల్ల చట్టాల సున్నితమైన సమతుల్యత దెబ్బతింటోందని కేంద్రం అభిప్రాయపడింది. ఈ మేరకు ఓ అఫిడవిట్ ను సమర్పించిన కేంద్రం, స్వలింగుల మధ్య వివాహాన్ని సమాజం అంగీకరించదని, చట్టపరంగానూ గుర్తించలేమని పేర్కొంది.

హిందూ వివాహం చట్టం, ప్రత్యేక వివాహ చట్టాల కింద సేమ్ సెక్స్ మ్యారేజ్ లను రిజిస్టర్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన ఓ పిటిషన్ పై విచారించిన హైకోర్టు స్పందించాలని కేంద్రాన్ని ఆదేశించగా, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను మిత్రా, మరో ముగ్గురు హక్కుల కార్యకర్తలు గోపీ శంకర్, గీతీ తడానీ, ఊర్వశిలు దాఖలు చేశారు.

More Telugu News