సుప్రీంకోర్టులో కార్తీ చిదంబరంకు ఊరట
- మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా కార్తీ
- 22 రోజుల పాటు తీహార్ జైల్లో గడిపిన కార్తీ
- విదేశాలకు వెళ్లేందుకు అనుమతించిన సుప్రీంకోర్టు
మరోవైపు రూ. 2 కోట్లు డిపాజిట్ చేయాలనే సుప్రీంకోర్టు ఆదేశాలపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని వేరే కోర్టు ఆదేశించిందని... అదే మొత్తాన్ని సుప్రీంకోర్టు కూడా కొనసాగించాలని కోరింది. ఈ నేపథ్యంలో కార్తీ తరపున వాదిస్తున్న కాంగ్రెస్ నేత, సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబాల్ వాదిస్తూ... తన క్లయింట్ పార్లమెంటు సభ్యుడని, ఆయన ఎక్కడికీ పారిపోరని అన్నారు. రూ. 10 కోట్లు డిపాజిట్ చేయాలనే ఆదేశాలను కొట్టివేయాలని కోరారు. సిబాల్ వాదనతో ఏకీభవించిన సుప్రీం ధర్మాసనం రూ. 2 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
మరోవైపు ఈ కేసులో 22 రోజుల పాటు ఢిల్లీలోని తీహార్ జైల్లో కార్తీ చిదంబరం గడిపారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు.