Madhya Pradesh: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఘోర బ‌స్సు ప్ర‌మాదం.. 22 మంది మృతి

Madhya Pradesh Bus carrying 60 passengers slides into canal in Sidhi district
షార్ట్స్‌లో చూడండి
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఘోర బ‌స్సు ప్ర‌మాదం చోటు చేసుకుని 22 మంది మృతి చెందారు. సిధి జిల్లా ప‌ట్నా మీదుగా ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ఓ బ‌స్సు అదుపుత‌ప్పి కాల్వ‌లో ప‌డింది. ఆ స‌మ‌యంలో బ‌స్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నారు. బ‌స్సు కాల్వ‌లో ప‌డిన అనంత‌రం ఏడుగురు ప్ర‌యాణికులు సుర‌క్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.

మిగతా వారికోసం స‌హాయ‌క బృందాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ ప్రమాద ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. ఈ ప్రమాదవార్త తెలుసుకున్న స్థానికులు పెద్దఎత్తున అక్క‌డ‌కు త‌ర‌లివ‌చ్చారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Madhya Pradesh
Road Accident

More Telugu News