మెడలో కొండచిలువతో నాగబాబు... ఫొటో ఇదిగో!
- సోషల్ మీడియాలో నాగబాబు ఆసక్తికర పోస్టు
- అన్ని ప్రాణులు సమాన హక్కులతోనే పుడతాయన్న మెగాబ్రదర్
- ప్రతి జీవికి బతికే హక్కు ఉందని ఉద్ఘాటన
- అందుకే ప్రేమను జీవులన్నింటికి పంచుదామని పిలుపు
- బతుకుదాం, బతకనిద్దాం అంటూ నినాదం
ప్రతి జీవికి బతికేందుకు, మనుగడ సాగించేందుకు, ఎదిగేందుకు తనకంటూ ఓ హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. అందుకే మీ ప్రేమను ఈ భూమిపై జీవించే అన్ని ప్రాణులకు పంచండి, వాటి రక్షణకు పాటుపడండి అని నాగబాబు పిలుపునిచ్చారు. బతుకుదాం, బతకనిద్దాం అని ఈ సందర్భంగా ఆయన నినదించారు.
జంతువుల సంరక్షణ, వాటి హక్కుల కోసం కృషి చేసే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్), పెటా, పెటా ఇండియా సంస్థలకు మద్దతుగా ఆయన ఈ పోస్టు చేసినట్టు హ్యాష్ ట్యాగ్ ల ద్వారా అర్థమవుతోంది.