Andhra Pradesh: ఏపీ కరోనా అప్ డేట్: కొత్తగా 55 పాజిటివ్ కేసులు

AP Corona cases media update
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 28,788 కరోనా శాంపిల్స్ పరీక్షించగా 55 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 9, చిత్తూరు జిల్లాలో 9 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 117 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 8,88,869 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,80,972 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 735 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7,162గా నమోదైంది. వరుసగా రెండోరోజు కూడా ఎలాంటి మరణాలు సంభవించలేదు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Update
Positive Cases
Active Cases

More Telugu News