ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ టీమిండియా
- టీమిండియా స్కోరు 36 ఓవర్లకు 121/6
- క్రీజులో కోహ్లీ (27), అశ్విన్ (1)
- ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగులు
- రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులు
టీమిండియా స్కోరు 36 ఓవర్లకు 121/6 గా ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 3, జాక్ లీచ్ 2, డామ్ బెస్ 1 వికెట్లు తీశారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 578, రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులు చేసి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసింది. భారత్ ఇంకా 295 పరుగులు వెనకబడి ఉంది. టీమిండియా చేతిలో మరో నాలుగు వికెట్లే ఉండడంతో ఇంగ్లండ్ గెలిచే అవకాశాలే అధికంగా ఉన్నాయి.