Caravan: అల్లు అర్జున్ కారవాన్ కు ఖమ్మం జిల్లాలో స్వల్ప ప్రమాదం 

  • మారేడుమిల్లిలో 'పుష్ప' షూటింగ్
  • షూటింగ్ అనంతరం తిరిగి హైదరాబాద్ పయనం
  • కారవాన్ ను వెనుక నుంచి ఢీకొట్టిన లారీ
  • ప్రమాదం సమయంలో కారవాన్ లో మేకప్ మన్
Lorry hits Allu Arjun caravan

టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ కు చెందిన ఓ కారవాన్ స్వల్ప ప్రమాదానికి గురైంది. షూటింగ్ విరామాల్లో అల్లు అర్జున్ ఈ కారవాన్ లోనే విశ్రాంతి తీసుకుంటుంటాడు. తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో 'పుష్ప' చిత్రం షూటింగ్ ముగించుకుని తిరిగి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఖమ్మం రూరల్ ప్రాంతంలోని సత్యనారాయణపురం వద్ద బన్నీ కారవాన్ ను ఓ లారీ వెనుకనుంచి ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారవాన్ లో మేకప్ మన్ మాత్రమే ఉన్నాడు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

More Telugu News