విశాఖ ఉక్కు కోసం... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు
- విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
- కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు గంటా వెల్లడి
- రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు పంపిన వైనం
- ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధంగా ఉండాలన్న గంటా
ఈ మేరకు స్వదస్తూరీతో రాసిన లేఖను అసెంబ్లీ స్పీకర్ కు పంపినట్టు వెల్లడించారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని గంటా నిన్ననే పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తానే మొదట నిర్ణయం తీసుకున్నారు. స్టీల్ ప్లాంటు పరిరక్షణ కోసం జేఏసీ ఏర్పాటు చేస్తానని కూడా గంటా ప్రకటించారు.