ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో తిరుమలకు వెళితే... శీఘ్రదర్శనం!
- శుభవార్త చెప్పిన ఏపీఎస్ ఆర్టీసీ
- రోజుకు 1000 మందికి దర్శనం
- రెండు స్లాట్లలో టికెట్ల విక్రయం
- రిజర్వేషన్ సమయంలోనే శీఘ్రదర్శనం టికెట్
ఈ స్కీములో రోజుకు 1000 టికెట్లను జారీ చేయనున్నామని తెలిపారు. ఈ టికెట్లు పొందిన వారికి త్వరితగతిన దర్శనం కల్పించేలా చూడడానికి తిరుమల బస్ స్టేషన్ లో ఆర్టీసీ సూపర్ వైజర్లను కూడా నియమించింది. కాగా, బెంగళూరు, హైదరాబాద్, పాండిచ్చేరి, విశాఖపట్నం, చెన్నై, కంచి, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.