Allu Arjun: అల్లు అర్జున్ కోసం రంపచోడవరం జంక్షన్ కి తరలివచ్చిన జనసందోహం!

  • 'పుష్ప' సినిమా షూటింగ్ లో బ‌న్నీ బిజీ
  • నిన్న రాత్రి రంపచోడవరానికి బ‌న్నీ
  • థ్యాంక్యూ అంటూ వీడియో పోస్ట్ చేసిన అల్లు అర్జున్
bunny fans came to shooting spot

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తోన్న ‌ 'పుష్ప' సినిమా షూటింగ్ ఖ‌మ్మం జిల్లాలోని మోతుగూడెంలో జ‌రుగుతోన్న స‌మయంలో రెండు రోజుల క్రితం బన్నీని చూసేందుకు స్థానికులు భారీగా త‌ర‌లివచ్చిన విష‌యం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరంలోనూ ఇటువంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది.

గ‌త‌ రాత్రి అల్లు అర్జున్‌ను చూడడానికి స్థానికులు భారీగా త‌ర‌లి వ‌చ్చారు. వంద‌లాది మంది రంపచోడవరం జంక్షన్‌కు తరలిరావ‌డంతో వారికి బ‌న్నీ హాయ్ చెప్పాడు. రాత్రి స‌మ‌యం కావ‌డంతో అంద‌రూ త‌మ స్మార్ట్ ‌ఫోన్ల‌లోని టార్చ్ లైట్ల‌ను ఆన్ చేసి మ‌రీ బ‌న్నీని చూశారు.

ఇందుకు సంబంధించిన వీడియోను అల్లు అర్జున్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ ‘థ్యాంక్యూ రంపచోడవరం’ అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. ఆగస్టు 13న 'పుష్ప' చిత్రాన్ని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్న‌ట్లు ఇటీవ‌ల ఈ సినిమా బృందం తెలిపింది.

ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్‌ అనే స్మగ్లర్‌గా క‌న‌ప‌డ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అట‌వీ ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ ప‌నులు పూర్తి చేసుకుంటోంది. సుకుమార్‌, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మూడో చిత్రం కావ‌డంతో దీనిపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

More Telugu News