Andhra Pradesh: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

  • వేసవిలో ఇంటర్ పరీక్షలు
  • మే 5 నుంచి 23 వరకు పరీక్షలు
  • మే 5 నుంచి 22 వరకు ఫస్టియర్ పరీక్షలు
  • మే 6 నుంచి 23 వరకు సెకండియర్ పరీక్షలు
  • మార్చి 31 నుంచి ఏప్రిల్ 24 వరకు ప్రాక్టికల్స్
Inter exams schedule released

కరోనా వ్యాప్తి కారణంగా ఏపీలో ఇంటర్ తరగతులు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు. ​ఈ వేసవిలో మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 5 నుంచి 22వ తేదీ వరకు ఫస్టియర్ పరీక్షలు, మే 6 నుంచి 23వ తేదీ వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 24 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. కాగా, ఇంటర్ పనిదినాల కుదింపు కారణంగా ప్రాక్టికల్స్ కు సంబంధించిన సిలబస్ లో 30 శాతం తగ్గించారు. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్ విద్యామండలి వెల్లడించింది. అటు, తెలంగాణలో మే 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.

More Telugu News