ఒంటిమిట్ట కోదండ రాముడిని దర్శించుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ

Nimmagadda visits Ontimitta kodanda rama temple
  • గత రాత్రి ఒంటిమిట్ట చేరుకున్న నిమ్మగడ్డ
  • ఉదయం అభిషేక పూజలు
  • స్వామి వారికి పట్టు వస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ ఉదయం ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. కడప జిల్లాలోని ఒంటిమిట్టకు గతరాత్రి చేరుకున్న నిమ్మగడ్డ ఈ తెల్లవారుజామున అభిషేక పూజల్లో పాల్గొన్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను పండితులు ఎస్‌ఈసీకి వివరించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కడప చేరుకున్న నిమ్మగడ్డ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరపనున్నారు.
Go Back to Shorts
Nimmagadda Ramesh Kumar
Ontimitta
Kadapa District

More Telugu News