Roja: రోజా నివాసంలో నటుడు అర్జున్ కుటుంబ సభ్యులు.. ఫొటోలు ఇవిగో!

  • కుటుంబ సమేతంగా నగరి వచ్చిన అర్జున్
  • అర్జున్ ఫ్యామిలీకి సాదర స్వాగతం పలికిన రోజా, సెల్వమణి
  • కుటుంబ విషయాలపై మాట్లాడుకున్న రోజా, అర్జున్
  • ఫొటోలు పంచుకున్న రోజా
Actor Arjun visits Roja house in Nagari

వైసీపీ ఎమ్మెల్యే రోజా, సీనియర్ నటుడు అర్జున్ కుటుంబాల మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ నగరిలోని రోజా నివాసానికి విచ్చేశారు. అర్జున్ కుటుంబాన్ని రోజా, ఆమె భర్త సెల్వమణి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రోజా, అర్జున్ కుటుంబాలు అనేక విషయాలు చర్చించుకున్నాయి. అర్జున్ వచ్చిన సమయంలో రోజా సోదరుడు రాంప్రసాద్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను రోజా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకున్నారు.

More Telugu News