Corona Virus: ఏపీలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు

Corona Update of Andhra Pradesh
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 36,189 కరోనా పరీక్షలు నిర్వహించగా 117 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 26 కొత్త కేసులు వెల్లడి కాగా, విశాఖ జిల్లాలో 19, గుంటూరు జిల్లాలో 17, చిత్తూరు జిల్లాలో 16 కేసులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. విజయనగరం జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 4, కడప జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 128 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,87,466 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,78,956 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,358 మంది చికిత్స పొందుతున్నారు. అటు, మొత్తం మరణాల సంఖ్య 7,152గా నమోదైంది.
Go Back to Shorts
Corona Virus
Andhra Pradesh
Positive Cases
Active Cases

More Telugu News