Sheep: నుదుటి మధ్యలో కళ్లతో వింత గొర్రె జననం!

  • ఉత్తరప్రదేశ్ లోని మొరాహత్ గ్రామంలో ఘటన
  • రెండ్రోజుల కిందట రెండు పిల్లలకు జన్మనిచ్చిన గొర్రె
  • వాటిలో ఒక దానికి విచిత్రమైన రూపు
  • శివుడి అంశ అంటూ పూజలు చేస్తున్న ప్రజలు
  • జన్యుమార్పుల వల్లేనంటున్న వెటర్నరీ నిపుణులు
Sheep has two eyes in the middle of forehead

ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ జిల్లాలోని మొరాహత్ గ్రామంలో ఓ గొర్రె పిల్ల విచిత్రమైన రీతిలో జన్మించింది. ఆ గొర్రె పిల్లకు రెండు కళ్లు నుదుటి మధ్యలో ఉండడంతో పరిసర గ్రామాల ప్రజలకు అదో వింతగా మారింది. దాంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ గొర్రె పిల్లను చూడ్డానికి వస్తున్నారు. పైగా దాని మూతి కూడా అసాధారణంగా కనిపిస్తోంది. అసలది గొర్రె పిల్లలానే లేదు.

రెండ్రోజుల కిందట ఓ గొర్రె రెండు పిల్లలకు జన్మనివ్వగా, వాటిలో ఒకటి ఇలా దర్శనిమిచ్చింది. కాగా, ప్రజలు దీన్ని శివుడి అంశ అని నమ్ముతున్నారు. అంతేకాదు, ఆ వింత గొర్రె పిల్లకు పూజలు కూడా చేస్తున్నారు. దీనిపై ఆ ప్రాంత పశు వైద్యుడు పుష్కర్ రాఠీ స్పందిస్తూ, జన్యు మార్పుల కారణంగానే ఇలాంటి పిల్లలు పుడతాయని వెల్లడించారు.

More Telugu News