Ayyanna Patrudu: విజయసాయిరెడ్డీ, ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదు కదా..?: అయ్యన్నపాత్రుడు

  • షర్మిల కొత్త పార్టీ పెడుతోందంటూ ప్రచారం
  • వ్యంగ్యంగా స్పందించిన అయ్యన్న
  • ఓ చెల్లి బాబాయ్ హత్యకేసు తేల్చమంటోందని ట్వీట్
  • మరో చెల్లి కొత్త పార్టీ పెడుతోందని వ్యాఖ్యలు
TDP leader Ayyanna Patrudu comments in twitter

సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వ్యంగ్యంగా స్పందించారు. బాబాయ్ హత్య కేసు తేల్చమంటూ ఓ వైపు నుంచి ఒక చెల్లి అడుగుతోందని, సైకో వేషాలు భరించలేక ఇంకో చెల్లి కొత్త పార్టీ పెడుతోందని అయ్యన్న పేర్కొన్నారు. ఈ విధంగా రెండు వైపుల నుంచి జగ్గడు నలిగిపోతున్నాడు... ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదు కదా..? అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు.

More Telugu News