Balakrishna: మాటల్లో చెప్పడమే కాదు... చేతలతో చేసి చూపించిన వ్యక్తి ఎన్టీఆర్: బాలకృష్ణ

  • ఎన్టీఆర్ ఒక యుగపురుషుడు
  • తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ధీరుడు
  • ఎన్టీఆర్ గురించి మాట్లాడటం అంటే సూర్యుడిని వేలితో చూపించినట్టే
Balakrishna praises NTR

దివంగత ఎన్టీఆర్ ఒక యుగపురుషుడని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ధీరుడని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడటం అంటే... సూర్యుడిని వేలుతో చూపించినట్టవుతుందని చెప్పారు. ఈ భూమి మీద ఎందరో పుడతారని... అయితే అందరూ మహానుభావులు కాలేరని అన్నారు.

అకుంఠిత దీక్ష ఉంటేనే ఏ మనిషి అయినా విజయపథంలో నడుస్తారనే విషయాన్ని ఎన్టీఆర్ ఎప్పుడూ చెపుతుండేవారని చెప్పారు. ఈరోజు ఎన్టీఆర్ 25వ వర్ధంతి. ఈ సందర్భంగా హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలయ్య ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News