గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,346 మందికి కరోనా నిర్ధారణ
Add ap7am to your home Screen

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,346 మందికి కరోనా నిర్ధారణ

India reports 20346 new COVID19 cases
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,95,278 
  • 24 గంట‌ల సమయంలో 222 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 1,50,336కు పెరిగింది.
  • నిన్నటి వరకు మొత్తం 17,84,00,995 కరోనా పరీక్షలు  
దేశంలో న‌మోదైన క‌రోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 20,346 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 19,587 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,95,278కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 222 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,50,336కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  1,00,16,859 మంది కోలుకున్నారు. 2,28,083 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 17,84,00,995 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 9,37,590 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
Telangana

More Telugu News